ganga dasara : 10 ర‌కాల పాపాలు పోగొట్టే గంగా ద‌స‌రా

ganga dasara telugu features

ganga dasara: రేపే గంగ దసరా.. 10 రకాల పాపాలు తొలగించే గొప్ప పూజా విధానం నియమాలు మీ కోసం!హిందూ సాంప్రదాయంలో గంగా నదికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంద‌ని మీకు తెలుసు. గంగా దేవి భూమిపైకి వ‌చ్చిన‌ పరమ పవిత్రమైన రోజు కాబ‌ట్టి మనం “గంగ దసరా” (Ganga Dussehra) గా వేడుక‌గా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ దశమి తిథి నాడు ఈ పండగ వస్తుంది.ఈ ఏడాది మే 25, 2026 (సోమవారం) నాడు గంగ దసరా వచ్చింది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం లేదా ఇంట్లోనే గంగాజలంతో పూజలు చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని అనాధిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ganga dasaraలో ఈ పండగ వెనుక ఉన్న కథ పూజా నియమాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందామా..

గంగ దసరా వెనుక ఉన్న అసలు కథ (Ganga History)

పురాణాల ప్రకారం సగర చక్రవర్తి కుమారులకు ఆయుషు ప్రసాదించడం కోసం వారి వంశానికి చెందిన భగీరథుడు ఘోరమైన తపస్సు చేశాడ‌ట‌. అతని తపస్సుకు మెచ్చి గంగాదేవి భూమిపైకి రావడానికి అంగీకరించింది. అయితే గంగమ్మ ఉధృతికి భూమి తట్టుకోలేద క‌దా అందుకే అది గ్రహించిన‌ పరమశివుడు ఆమెను తన జటాజూటంలో బంధించి ఆ తర్వాత భూమిపైకి స‌న్న‌గా వదిలాడు. భగీరథుని సుదీర్ఘ ప్రయత్నం వల్ల జ్యేష్ఠ శుద్ధ దశమి రోజే గంగమ్మ భూలోకానికి రావ‌డం జ‌రిగింది. అందుకే ఆ రోజును ‘గంగావతరణం’ అని కూడా అంటారు.

10 రకాల పాపాలకు విముక్తి

‘దసరా’ అంటే పది రకాల పాపాలను హరించేది అని అర్థం. మనుషులు తెలిసి కానీ తెలియక కానీ చేసే 10 రకాల మహా పాపాలు ఈ రోజున గంగా స్నానం చేయడం వల్ల నశిస్తాయని హిందువూలు నమ్ముతారు. ఆ పాపాలు మూడు రకాలుగా విభజించబడ్డాయి.

పాపాల రకం                    సంఖ్య         వివరణ
కాయక పాపాలు            3                     శరీరం ద్వారా చేసే తప్పులు
వాచక పాపాలు             4                      మాటల ద్వారా ఇతరులను బాధించడం.
మానసిక పాపాలు       3                       మనసులో చెడు ఆలోచనలు కలిగి ఉండటం

ఇంట్లోనే పూజా విధానం .. నియమాలు

ఒకవేళ గంగా నదికి వెళ్లే అవకాశం లేని వారు ఇంట్లోనే ఈ చిన్న నియమాలు పాటించి గంగమ్మ అనుగ్రహాన్ని పొందవచ్చ పెద్ద‌లు చెబుతున్నారు.

పవిత్ర స్నానం: ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర‌ లేచి మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలాన్ని కలుపుకోవాలి. స్నానం చేసేటప్పుడు గంగా శ్లోకాలను గానీ ఓం శ్రీ గంగాయై నమః అనే మంత్రాన్ని గానీ జపించాల్సి ఉంటుంది.

సూర్య అర్ఘ్యం: స్నానం పూర్తయిన తర్వాత తూర్పు ముఖంగా నిలబడి సూర్య భగవానునికి అర్ఘ్యం (నీటిని వదలడం) ఇవ్వాలి. ఇది మానసిక ప్రశాంతతను తేజస్సును ఇస్తుంది.

ganga dasara telugu features
ganga dasara telugu features

దీపారాధన: సాయంత్రం సమయంలో ఇంట్లో పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి గంగా చాలీసా లేదా విష్ణు సహస్రనామం పఠించడం వల్ల కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయ‌ని చెబుతారు.

దానధర్మాలు: గంగ దసరా రోజున దానానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ganga dasara ఈ రోజు పేదలకు అన్నదానం చేయడం, లేదా పక్షులకు జంతువులకు నీరు ఆహారం అందించడం వల్ల జాతకంలోని గ్రహ దోషాలు వెంట‌నే తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం సిద్దిస్తుంది.

ఇవి కూడా చ‌ద‌వండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *